తల్లిపాలే బిడ్డకు పసిపాపకు శ్రేష్టం, ఆరోగ్యకరం -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సతీష్ శారద

  • తల్లిపాలే బిడ్డకు పసిపాపకు శ్రేష్టం, ఆరోగ్యకరం
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సతీష్ శారద

వరంగల్, అక్షిత బ్యూరో: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సి కె ఎం మాతా శిశు ఆరోగ్య ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై తల్లిపాల విశిష్టతను వివరించారు. అనంతరం సికె ఎం ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను
కలెక్టర్‌ డాక్టర్ సత్య శారద నేరుగా గర్భిణులకు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను
పరిశీలించి పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డి డబ్ల్యూ ఓ రాజమణి, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking