కుట్రల కోటలు బద్దలు కొడతాం..

*కుట్రల కోటలు బద్దలు కొడతాం..*
*సూరరపు కృష్ణవేణి*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించి, తెలంగాణ ఆత్మ గౌరవ పతాకనెత్తి పట్టి జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు, శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పై పథకం ప్రకారం కుయుక్తులు పన్నుతున్న వాళ్ళ కుట్రల కోటలు బద్ద లు కొడతామని తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి హెచ్చ రించారు, స్వరాష్ట్ర సాధన మొదలు సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆ కాంక్షలు నెరవేరాలని, సమస్యలు పరిష్కారం కావాలని పోరాడిన కవితక్క పై తప్పుడు ప్రచారం చేస్తూ, ఆమె రాజకీయ భవిష్యత్ ను నష్ట పరచాలని వ్యూహాలు పన్నుతో దొడ్డి దారిన విష ప్రచారానికి పూనుకుంటున్న శక్తుల ఆశలు నెరవేరవని ఆమె అన్నారు, కవితక్క ప్రతిష్ట కు భంగం కలిగించాలని చూస్తున్న వారికి ప్రజా క్షేత్రం లో భంగ పాటు తప్పదు అని పేర్కొన్నారు ,పార్లమెంట్లో తెలంగాణవాణిని బలంగా వినిపించి అనేక రకాలుగా పోరాడి సాధించిన విజయాల ను ప్రజల మరువరని , మహిళా సమాజం కవితక్కకు అండగా నిలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల ఉద్యమాలు నిర్వహిస్తున్న కవితక్క నేతృత్వం లో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మితం అవుతాయి విజయం సాధిస్థాయి అని అన్నారు, కవితక్క తో పెట్టు కుంటే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో ప్రజలే తెలుస్తారని తప్పుడు ప్రచారాల పునాదుల పై నిలబడి విర్రవీగుతున్న వాళ్లు కాల గర్భం లో కలిసి పోక తప్ప దని హెచ్చరించారు , విజ్ఞులు అయిన తెలంగాణ ప్రజలు ఉద్యమ బిడ్డ కవితక్క ను కంటికి రెప్పలా కాపాడు కుంటారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking