ప్రజా సమస్యలపై ఇంటింటి సర్వే

ప్రజా సమస్యలపై ఇంటింటి సర్వే

ఉన్నోళ్లకే పథకాలు లేనోళ్లకు మొండి చేయి 

వరంగల్, అక్షిత బ్యూరో:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12,13వ డివిజన్ లో ప్రజా సమస్యలపై సీపీఎం క్షేత్రస్థాయి సర్వేలు ప్రజా సమస్యలపై సీపీఎం సర్వే దేశాయిపేట ఎంహెచ్ నగర్, వివర్స్ కాలనీ, లెనిన్ నగర్, ఎల్బీనగర్, ఈ రెండు డివిజన్ ల లోని కాలనీల లో ఉన్న సమస్యలను గుర్తిస్తున్న సీపీఎం నాయకులు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలో 12,13వ డివిజన్ లోని పలు కాలనీలో శనివారం ప్రజా సమస్యలపై సీపీఎం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలు చేస్తూ సీపీఎం కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి మహమ్మద్ బషీర్ అహ్మద్ మాట్లాడుతూ దేశాయిపేటలో 150 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 32 మందిని మాత్రమే లబ్ధిదారుల జాబితాలో ఉన్నారన్నారు.12వ డివిజన్ దేశాయిపేట, కుమ్మరివాడ కాపు, వాడ, గొల్లవాడ,అలాగే 13వ డివిజన్ లో నవయుగ కాలనీ, కళ్యాణి నగర్,శ్రీనివాస్ నగర్ కాలనీ, ఏకశిలా నగర్, ఎల్బీనగర్, లో డ్రైనేజీ, సీసీరోడ్డు సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వీధిలైట్లు, తాగునీటి సౌకర్యం,అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీతో పాటు పలు సమస్యలు గ్రామస్థులు ఎదుర్కుంటున్నారని తెలిపారు, గణేష్ నగర్ కాలనీలో కుక్కలు కోతుల బెడదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,వెంటనే ప్రజాప్రతినిధులు స్థానిక కార్పొరేటర్,మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని, తెలిపారు, పలు కాలనీలో దోమల బెడదతో తీవ్ర అనారోగ్య కారణాలతో దోమ కాటుకు బలవుతున్నారని పేర్కొన్నారు, ఏకశిలా నగర్ లోని మౌలాలి ప్రభుత్వ పాఠశాల ప్రాంతాల్లో కొంత మంది యువత ఆకతాయి చేస్టలకు పాల్పడుతున్నట్టు గుర్తించారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మందు బాబులకు నిలయంగా మారాయి. రాత్రి వేళ్ళలో మందుబాబులు యథే చ్ఛగా మద్యం సేవిస్తున్నారు. మౌలాలి ప్రభుత్వ పాఠ శాలల ఆవరణలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్య కలా పాలకు పాల్పడుతున్నారని ఈ సమస్యల పరిష్కారం కోసం డివిజన్ ఇలా ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని బషీర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసీపీఎం కాశిబుగ్గ ఏరియా నాయకులు మేకల లింగయ్య, కత్తుల వెంకన్న, మార్తా, దయమా, వంగూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking