స్వచ్ఛదనం-పచ్చదనం’లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి
తహసిల్దార్ లాల్ బహదూర్, సిఐ ఎన్.వెంకటేశ్వర్లు
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తహసిల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి,సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం నాడు రామన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుకుడాల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వారు పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు.

జీవకోటికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించే మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతూ వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై డి. నాగరాజు, కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎండి తకియోద్దీన్, గౌరవ సలహాదారులు కనుతాల శశిధర్ రెడ్డి, లవణం ఉపేందర్, ప్రధాన కార్యదర్శి కొండ మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు జినుకల శ్రీనివాస్, బోయపల్లి యాదయ్య, ఆర్గనైజర్ తెలుసూరి మల్లేశం, సహాయ కార్యదర్శిలు మీర్జా హర్షద్, నడిగోడి నాగేష్, ముత్యాల రమేష్, సాంస్కృతిక కార్యదర్శి నడిగోటి కృష్ణ, సభ్యులు మధ్యగల నరసింహ, నాగటి యాదయ్య, మాండ్ర సత్యనారాయణ, బొడ్డు పరశురాములు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.