రామన్నపేట గల్స్ హై స్కూల్ లో లీగల్ సర్వీసెస్ అవగాహన సదస్సు
– హాజరైన జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవ్వ జ్యోతి సమక్షంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో విద్యార్థులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష హాజరయ్యారు.

ఈ సమావేశంలో జడ్జీ మాట్లాడుతూ విద్యార్దులు చదువు తో పాటు చట్టాలపై అవగాహన ఉండాలని, బయట సమాజంలో బాలికల పట్ల ఎన్నో రకాల అగత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత, అవగాహన ముఖ్యం అని అన్నారు. విద్య హక్కు చట్టం, పోక్సో చట్టం, మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలు, బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండీ మస్జిద్, ప్యానల్ లాయర్ బి.డేవిడ్, అడ్వకేట్ కునూరు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు గవ్వ జ్యోతి, రామన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. నాగరాజు, లీగల్ సెల్ సభ్యులు బత్తుల గణేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్దులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.