శాంతి నిలయంను ఆకస్మికంగా సందర్శించిన సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత

శాంతి నిలయంను ఆకస్మికంగా సందర్శించిన సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత

యాదాద్రి భువనగిరి, అక్షిత బ్యూరో :

మండల కేంద్రంలో గల శాంతి నిలయం హర్ఫానైజ్ హోమ్ ను శనివారం నాడు మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత ఆకస్మికంగా సందర్శించారు.

అక్కడ విద్యార్థుల ఎంపిక విధానం, వారికి కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి మధ్యాహ్న భోజన సదుపాయం ను వంటలను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ దంతూరి సత్తయ్య, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జాఫర్ అలీ, లీగల్ సెల్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, హోమ్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking