తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలి 

తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలి 

కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దేవుని కృప అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆమె జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటుచేసిన మొదటి గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా, కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా వినాయకుడు అందరిని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రజలు తలపెట్టిన కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగేందుకు ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండేందుకు దేవుని కృప అవసరమని, వినాయకుడు తన కృపను, కరుణా కటాక్షాలను ప్రజలకు అందించి దీవించాలని వేడుకొన్నారు.

జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి , గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ యాదగిరి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking