మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

మియాపూర్, అక్షిత ప్రతినిధి :

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మియాపూర్ ఆర్‌బీఆర్ కాంప్లెక్స్ ప్రాంగణంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం విశేషంగా జరిగింది. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ,అవగాహన కల్పిస్తూ విస్తృతస్థాయిలో ప్రజలకు చేర్చేందుకు ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా మియాపూర్ డివిజన్ ప్రజలకు యలమంచి ఉదయ్ కిరణ్,రాచమల్ల భాస్కర్ గౌడ్, ఇతరులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రజలతో కలిసిమెలిసి, పర్యావరణహిత వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహించారు.
యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు ఫౌండర్ , చైర్మన్, యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ..మనసంప్రదాయాలు, ఆచారాలను కొనసాగిస్తూ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం ఈతరంబాధ్యత, మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రజల్లో విస్తృతమైన స్పందన రావడం సంతోషకరం” అని తెలిపారు.ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, రాచమల్ల భాస్కర్ గౌడ్, శరత్, వినోద్ చౌదరి, ప్రసాద్, నాగరాజు, వీరబద్రం, సుబ్బారావు, బాబు, శంభశివరావు, రాధాకృష్ణ, నాని, పూర్ణ, ఎం.ఆర్‌.కె. చౌదరి, హనుమంత్, సంజు, మహేష్, అశోక్, ప్రవీణ్, సాయి యాదవ్, రవి, సోను, దాతు, పండ్యా, సిద్ధార్థ్, రఠన్ డిజె, శివ, బబ్లు, గజానంద్, విజయ్ మాల్యా, కృష్ణ, సాయి, విశాల్, గౌతమ్, హరి, శ్రవణ్, తులసి చౌదరి, నరేష్, రాజు, పెదబాబు, చిన్నా, అభిజీత్, సంతోష్, పవన్, వంశీ, నాగసాయి, వినోద్, మధు, యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking