గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి, అక్షిత ప్రతినిధి :

ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చేరికల కమిటీ కన్వినర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాయపర్తి మండలంలోని జయరాం తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ బానోత్ రవి మాజీ ఉప సర్పంచ్ గుగులోత్ సూర్య కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోత్ నర్సింహా బాధవత్ రమేష్ గుగులోత్ నరేష్ భూక్య బాలు గుగులోత్ నర్సింహా గుగులోత్ హామర్ సింగ్ బానోత్ బాలు గుగులోత్ సురేందర్ బానోత్ హచ్య బానోత్ లచ్చు గుగులోత్ రమేష్ గుగులోత్ ప్రవీణ్ బాధవత్ శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్ లో మాజీ మంత్రి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా రాష్ట్ర మాజీ మంత్రి పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ ఎన్నికల ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు రాయపర్తి మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్, మండల పార్టీ నాయకులు బద్దం వేణుగోపాల్ రెడ్డి లేతకుల మధుకర్ రెడ్డి, మండల పార్టీ యూత్ అధ్యక్షులు ముత్తడి సాగర్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు ఆశ్రఫ్ పాషా మండల పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి సంకినేని ఎల్లస్వామి యూత్ నాయకులు కోలా సంపత్, సాయి, అనిల్, ప్రవీణ్ స్థానిక నాయకులు అయిన గ్రామ పార్టీ అధ్యక్షులు గుగులోత్ రమేష్ పార్టీ ముఖ్య నాయకులు గుగులోత్ జగన్, గుగులోత్ గౌస్ నాయక్, బాధవత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking