ఘనంగా సందీప్ జన్మదిన వేడుకలు*

*ఘనంగా సందీప్ జన్మదిన వేడుకలు*

కోదండరాంపురం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నధాన కార్యక్రమం

• నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు , 25 కేజీల బియ్యం

హుజూర్ నగర్,అక్షిత ప్రతినిధి :

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోదండరాంపురం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మచ్చ సందీప్ జన్మదిన వేడుకలు భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఇటీవల కాలంలో బైక్ యాక్సిడెంట్ లో మరణించిన సందీప్ జన్మదినం పురష్కరించుకుని కోదండరాంపురం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదానం,అన్నదానం ఏర్పాటు చేసిన కోదండరాంపురం గ్రామంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు,25 కేజీల బియ్యం సందీప్ తల్లిదండ్రుల చేతుల మీదగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు రాపోలు నవీన్, మాట్లాడుతూ సందీప్ మరణించిన దగ్గర నుండి తన స్నేహితులు సందీప్ ని గుర్తు చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని, ఈనాడు సందీప్ జన్మదిన సందర్భంగా ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపటం కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతోమందికి రక్తదానం,అన్నదానం,నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేయడం సంతోషకరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల ఏ ఈ చిలక నవీన్, పంగ నాగరాజు, మచ్చా మురళి, కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి చిరంజీవి, యువకులు సుధాకర్, సంతోష్, వినోద్, నవీన్, సందీప్, మనోహర్, గణేష్, కార్తీక్, ప్రవీణ్, కిషోర్, చింటు, సాయి, బన్నీ, నోముల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking