గంగారం దళితవాడలో ఇందిరమ్మ ఇండ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి

సత్తుపల్లి, అక్షిత న్యూస్:  ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామం పాత దళిత వాడలో అర్హులైన పేదవాళ్ళు వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, డ్రైనేజీలు నిర్మించాలని సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గంగారం సీపీఎం పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో మంగళవారం దళిత కాలనీలో సమస్యలపై అధ్యయనం చేశారు.ఈ సందర్భంగా జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన వారి పేర్లు అధికారులు విడుదల చేసిన లిస్ట్ లో వచ్చినా ఇందిరమ్మఇండ్లు ఇవ్వలేదన్నారు.ఈ కాలనీలో 16 మంది అర్హులైన వారు ఉన్నారని అయినా ఒక్కరికైనా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఈ దళిత కాలనీ వారికి ఇండ్లు ఇవ్వలేదు, తాటాకులు, రేకుల ఇండ్లలో ఉంటున్నారు వర్షం వస్తే కురుస్తున్నాయన్నారు. ఇండ్లపై పరదాలు కప్పుకొని నివాసం ఉంటున్నారు అన్నారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారందరికీ రెండో విడతలోనైనా ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉన్నందున పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. డ్రైనేజీలు లేక నీరు ఇళ్లలోకి వస్తుందన్నారు. నీరు నిలవ ఉండకుండా పేరుకుపోయిన మురికిని తొలగించాలన్నారు. దోమల మందులు పిచికారి చేయాలని, ప్రజలు వ్యాధుల బారిన పడి అనారోగ్యం పాలు కాకుండా ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కొత్తపల్లి రఘు,కావూరి వెంకటేశ్వరరావు,కువ్వారపు నాగరాజు, రాంబాబు, నాగశేషు, ప్రమీల, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking