రామన్నపేట, అక్షిత ప్రతినిధి: జిల్లా స్థాయి క్రీడా పోటీలకు మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. కబడ్డీలో అండర్ 17 విభాగంలో బి. చైత్ర, కె. వర్షిత , కె.శివ, పి. అక్షయ్, ఎస్. చరణ్, సి హెచ్ సందీప్ , ఖో ఖో విభాగంలో పి.భానుప్రకాష్, కె .శివ, వాలీబాల్ విభాగంలో ఎన్ అనుశ్రీ, అండర్ 14 కబడ్డీ విభాగంలో ఇ. శ్రీవిద్య, పి. నిశిత, బి.శశాంక్, ఎన్.వరుణ్, పి.మత్స్యగిరి, ఖో ఖో విభాగంలో మత్స్యగిరి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, అందుకు ప్రోత్సహించినా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం . ప్రవీణ్ కుమార్ ను, ప్రిన్సిపాల్ బి. యాదగిరి, డైరెక్టర్ జె. మణి తో ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.
