అక్షిత, న్యూస్ సత్తుపల్లి: వ్యాధుల బారినపడి ఆపదలో ఉన్న కడుపేదలైన అభాగ్యులను ఎంతోమంది ని అక్కున చేర్చుకుని ప్రేమను పంచి వారికి సేవలందించిన గొప్ప మానవతా మూర్తి మదర్ థెరిసా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. మంగళవారం రోజు మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలోని మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడు పేదలు ఐనటువంటి వ్యాధిగ్రస్తులను అనాధలను ఎందరినో అక్కున చేర్చుకుని ప్రేమను పంచి వారి జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప మానవతా మూర్తి మదర్ థెరిసా అని కొనియాడారు.అలాంటి గొప్ప మాతృమూర్తి ప్రేమతో చూపిన బాటలో ఆమె స్పూర్తితో మనమందరం కలిసి నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు,నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు , చల్లగుళ్ళ కృష్ణయ్య,వేణు,దొడ్డా శ్రీను,మానుకోట ప్రసాద్,సత్తుపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట సుజల రాణి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు షేక్ నాగుల్ మీరా, షేక్ మౌలాలి (గ్రాండ్ మౌలాలి)ఎండి కమల్ పాషా యండి గఫార్, ఐ.శ్రీను, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కనపర్తి కుమారి, మల్లూరు దిలీప్,మిద్దె రామకృష్ణ,జమలయ్య తదితరులు పాల్గొన్నారు.