నువ్వే నీ బలం… బలహీనత

సూర్యాపేట టౌన్, అక్షిత న్యూస్: సమాజాన్ని అవగాహన చేసుకుంటూ, ప్రేరేపిత లక్ష్యాల వైపు వెళ్లే విధంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలని ప్రముఖ వక్త వేణుగోపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏవిఎం (ఆనంద విద్యా మందిర్) పాఠశాల ప్రిన్సిపాల్ ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, ఆ లక్ష్యం సాధించేందుకు శ్రమించాలన్నారు. మనకు ముందు తరాలు సాధించిన విజయాలు, ఘనతను తెలుసుకునేందుకు వారి జీవిత చరిత్ర కు సంబంధించిన పుస్తకాలు పఠనం చెయ్యాలన్నారు. కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, నీవు పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తెచ్చిపెట్టే చదువుకోవాలన్నారు. లక్ష్యం చేరుకోవాలనే తపనలో ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking