ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి, అక్షిత న్యూస్: మంగళవారం రోజు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. గ్రామంలోఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇప్పటి వరకు ఎంత మేర నిర్మాణ పనులు జరిగాయని, నిర్మాణపు పనులు జరిగినంతవరకు లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అయ్యాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్త 15 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయ, అన్ని కూడా లెంటల్ వరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటి వరకు 15 ఇండ్లకు సంబంధిచి వారి అందరికీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ అని తెలిపారు.లబ్ధిదారులు అందరూ కూడా ఇండ్లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. డబ్బులు మీ ఖాతాల్లో ప్రతి సోమవారం జమ అవుతాయ అని తెలిపారు.గ్రామంలో ఎవరు అయినా ఇందిరమ్మ ఇండ్ల ఇప్పిస్తాం వెంటనే డబ్బులు వేయిస్తాం అని డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలి అన్నారు. అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking