అక్షిత న్యూస్, అనంతగిరి: మండల స్థాయి ఎస్ జి ఎఫ్ ఆటల పోటీలు అండర్ 17 అండర్ 14 బాల బాలికలకు సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాంతినగర్ లో శనివారం రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ చదువుతోపాటు ఆటలు చాలా ముఖ్యమని తెలియజేసినారు శనివారం రోజు జరిగిన క్రీడా పోటీలలో గెలుపొంది డివిజన్ స్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శాంతినగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం గోవిందరెడ్డి శ్రీధర్ ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ సైదులు మరియు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
