*అంధకారంలో అడ్డగూడూరు*
*పలు కాలనీలో వెలగని వీధి దీపాలు , ప్రజలకు తప్పని అవస్థలు*
*మాజీ వార్డ్ మెంబర్ తుప్పతి వరలక్ష్మి*
అడ్డగూడూరు, అక్షిత ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని రాత్రి అయితే చాలు చాలా కాలనీలో దీపాలు వెళ్ళగని పరిస్థితి.

గ్రామపంచాయతీ నుంచి రాముల వారి గుడి వరకు దీపాలు వెలగకపోవడంతో అంధకారంలో పలు కాలనీ ప్రజలు ఉంటున్నారని మాజీ వార్డ్ మెంబర్ తుప్పతి వరలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారన్నారు . పలుమార్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి, గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకునే పాపాన లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి కాలనీలో లైట్లు వేయాలని కోరుతున్నారు.