నాటడమే కాదు… సంరక్షించాలి

నాటడమే కాదు…
సంరక్షించాలి

దశమి లాబ్స్ ఫార్మా” లో
మొక్కలు నాటిన కలెక్టర్

చిట్యాల, అక్షిత న్యూస్ :

మొక్కలు నాటడంతో పాటు, వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా, చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఉన్న హెటిరో కంపెనీ అనుబంధ సంస్థ “దశమి లాబ్స్ ఫార్మా” కంపెనీలో వనమహోత్సవం కింద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతారని అయితే వాటిని సంరక్షించకపోవడం వల్ల అవి ఎండిపోతాయని, అలా కాకుండా నాటిన ప్రతి మొక్కను కాపాడాలని, అందుకు నిరంతరం మొక్కలకు నీరందించాలని అవసరమైతే డ్రిప్ సౌకర్యం ద్వారా నిరందించాలని, లేదా ట్యాంకర్ ద్వారా నీరు పోయాలని సూచించారు.

దశమి ఫార్మాస్యూటికల్ ల్యాబ్ ఆవరణ బాగుందని, పర్యావరణాన్ని కాపాడడానికి చేస్తున్న కృషిని ఆమె అభినందించారు .మొక్కలు నాటడంతోపాటు ,ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది, బయట వ్యక్తులు భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని, తప్పనిసరిగా పారిశ్రామిక భద్రతకు సంబంధించిన నియమ, నిబంధనలను పాటించాలని చెప్పారు. అవసరమైతే కంపెనీలో అందుబాటులో ఉన్న స్థలంలో మియావాకి తరహాలో చిట్టడవులు అభివృద్ధి చేయాలని సూచించారు. భవిష్యత్తులో నల్గొండ లాంటి ప్రాంతానికి ఇలాంటివి ఎంతగానో అవసరం అవుతాయని, ఇందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి , దశమి సంస్థ ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking