ఘనంగా ఫోటోటేక్ ట్రేడ్ షో పోస్టర్ ఆవిష్కరణ

తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి: ఈ నెల 19, 20, 21 న హైదరాబాద్ లోని నార్సింగ్ లో జరిగే ఫోటో టేక్ ట్రేడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరుతూ తిరుమలగిరి మండల కేంద్రంలోని చౌరస్తా లో ఫోటో టేక్ టెడ్ షో పోస్టర్ ను ఎస్సై వెంకటేశ్వర్లు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజితో వస్తున్న కెమెరాలతో ఫోటో గ్రాఫర్ దినదినం అభివృద్ధి చెందాలని,మండలంలోని ఫోటో గ్రాఫర్లకు స్థానిక పోలీసులు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరి యాదగిరి, జిల్లా మాజీ కోశాధికారి లాలు, మండల అధ్యక్షులు సుంకరి సుధీర్, ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి సన్నీ, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, ఉపాధ్యక్షులు పర్శరాములు, కుటుంబ భరోసా ఇంచార్జి అర్జున్, సీనియర్ ఫోటో గ్రాఫర్ లు బానోతు కిష్టు నాయక్, గంగాధర్, యాదగిరి,అశోక్,వెంకట్, శ్యామ్, శ్రీను, రామేష్, శ్రీను, కుషిల్, రమేష్, హరీష్,జియా, రాజు, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking