మేడ్చల్, అక్షిత ప్రతినిధి: మిలాద్ ఉన నబీ సందర్భంగా మేడ్చల్ పట్టణంలో ఆదివారం ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ మసీదు వద్ద ప్రారంభమైన ర్యాలీ మేడ్చల్ పట్టణంలోని ప్రధాన రోడ్లు, వీధులు మీదుగా కొనసాగించి, వీకర్ సెక్షన్ కాలనీ వద్ద ముగిసింది. ర్యాలీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేడ్చల్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు సయ్యద్ ఇనాయత్ అలీ, ఎండీ రఫిక్, ఆరీఫ్, మునీర్ మౌలిసాబ్, సయ్యద్ లాయక్ అలీ, మహబూబ్ అలీ, అబేద్ తదితరులు పాల్గొన్నారు.