ఎమ్మెల్యే పీఏనంటూ యూరియా లారీ పక్కదారి

  • ఎమ్మెల్యే పీఏనంటూ యూరియా లారీ పక్కదారి 
  • వెలుగులోకి గన్ మెన్ ఘన కార్యం
  • విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్ మెన్ ఓవరాక్షన్ వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పీఏనంటూ ఓ జిల్లా అధికారికి ఫోన్ చేసి యూరియాను పక్కదారి పట్టించిన ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం ఆయా మీడియా, సోషల్ మీడియాల్లో హల్ చల్ తో సంచలనమైంది. వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్ మెన్ గా పనిచేస్తున్న నాగునాయక్ వ్యవసాయాధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే పీఏని మాట్లాడుతున్నానని ఎమ్మెల్యే బిజీగా ఉన్నారని, లారీ లోడ్ యూరియాను పలాన చోటుకు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సదరు అధికారి ఆదేశాలను పాటించగా ఇటీవల రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని వ్యవసాయాధికారికి ఫోన్ చేసి యూరియాపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆ గన్ మెన్ బాగోతంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా అతన్ని జిల్లా కేంద్రానికి అటాచ్ చేసి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking