- మొక్కలతోనే పచ్చదనం
- డ్రిప్ సౌకర్యంతో మొక్కల రక్షణ
- మస్జీద్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎండి. హఫీజుద్దీన్, ఎండి. మహబూబ్ అలీ బాబా
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామపంచాయతీ శివారులోని మస్జీద్ అరాఫత్ పర్యవేక్షణలో ఉన్న ఈద్ గాహ్ లో రాష్ట్ర ప్రభుత్వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ముస్లింలు మొక్కలు నాటారు. మస్జీద్ కమిటీ బాధ్యులు సుమారు 250 మొక్కలు కొనుగోలు చేసి నాటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గతంలో సుమారు 2000 మొక్కలు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఆధ్వర్యంలో నాటడం జరిగిందన్నారు. నాటిన మొక్కలు సంరక్షణ బాధ్యత చేపట్టామని, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎండి. హఫీజుద్దీన్, ఎండి. మహబూబ్ అలీ బాబా, ఖుర్బాన్ అలీ, సోని సమద్, ఎండి.మొయినుద్దీన్, జమాత్ పాషా భాయ్, ఖాజా నాజీముద్దీన్, ఎండి. అస్లాం, ఎండి.నాహిద్, ఎండి.ముజీబ్, పర్వేజ్, జహంగీర్ అలీ, ఖాజా హామీదుద్దీన్, లల్లు, వెంకన్న పాల్గొన్నారు.
