ప్రజలకు చేరువలో
పాస్ పోర్ట్ సేవలు
పాస్ పోర్ట్ జారీలో
ఐదో స్థానం తెలంగాణ
ఆధార్ కార్డు మాదిరి
పాస్ పోర్ట్ కల్గి ఉండాలి
పాస్ పోర్ట్ సేవా
కేంద్రం ప్రారంభం
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
దేశంలోనే పాస్ పోర్ట్ జారీలో ఐదో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి మెట్రోలో ప్రారంభమైన మొదటి పాస్ పోర్ట్ కేంద్రం ఎంజీబీఎస్ పాస్ పోర్ట్ కార్యాలయమని ప్రారంభించుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో దేశంలోనే 5 వ స్థానంలో ఉందని, తెలంగాణలో 5 పాస్ పోర్ట్ కేంద్రాలు బేగంపేట ప్రధాన పాస్ పోర్ట్ కేంద్రంగా నిలిచిందని అలాగే ఎంజీబీఎస్ , టోలిచౌకి , నిజామాబాద్ , కరీంనగర్ లలో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో రోజుకు 4500 పాస్ పోర్ట్ లు ఇచ్చే సామర్యం ఉందని తెలుపుతూ 750 నుండి 1200 స్లాట్స్ సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు.

ఎంపీగా ఉన్నకాలంలో కరీంనగర్ లో ప్రారంభించుకున్న పాస్ పోర్ట్ కేంద్రంలో 250 ఉండగా 500 స్లాట్స్ పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆధార్ కార్డు మాదిరి ప్రతి ఒక్కరు పాస్ పోర్ట్ తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికుల మాదిరి విదేశాలకు వెళ్లేదని ఇప్పుడు విద్యా, ఉపాధి అవకాశాలు నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి పాస్ పోర్ట్ అవసరమని అందరు తీసుకోవాలన్నారు.ఎంజీబీఎస్ లో పాస్ పోర్ట్ కేంద్రం అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడ మెట్రో,బస్ స్టేషన్ ద్వారా వివిధ జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి పాస్ పోర్ట్ తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని ఇక్కడ మెట్రో బస్ సౌకర్యం ఉండడం వల్ల ఎక్కువ స్లాట్స్ బుక్ అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. పాస్ పోర్ట్ కోసం వచ్చే వారిపట్ల సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, రాష్ట్రంలో ఎంజీబీఎస్ లోనే పాస్ పోర్ట్ తీసుకుంటాం అనే విధంగా వ్యవహరించాలని సూచించారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో పోలీస్ లు వేగవంతంగా చేపట్టాలని అన్నారు. మనం అప్లై చేసుకోగానే వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసుకొని పాస్ పోర్ట్ వచ్చేలా చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి విద్యావంతులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగుల కోసం అలాగే ఉపాధి అవకాశాల కోసం ఎందరో వెళ్లే సందర్భాల్లో బస్టాండ్, మెట్రో స్టేషన్ ఉండటం సులభతరంగా ఉందని ఈ సందర్భంగా వివరించారు. హైదరాబాద్ బేగంపేట్ నందు 1976లో పాస్ పోర్ట్ కార్యాలయం ఉండటంతో కొంత ఇబ్బందులు ఉండేవని అన్నారు. హైదరాబాద్ మహానగరం పాస్ పోర్ట్ జారీలో దేశంలోనే ఐదవ స్థానంలో నిలిచిందని అలాగే తెలంగాణ పోలీస్ యంత్రాంగం పాస్ స్పోర్ట్స్ వెరిఫికేషన్ లో ముందుండాలని ఆయన సూచించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి పాస్ పోర్ట్ అవసరం పడుతుందని ఈ కేంద్రం ఏర్పాటుతో మరింత సులభతరం అవటం జరిగిందని తెలిపారు.అనంతరం పాస్ పోర్ట్ కార్యాలయంలోని ఉద్యోగులతో మాట్లాడారు.
తదుపరి పాస్ పోర్ట్ కార్యాలయాన్ని పరిశీలించి
ప్రతి రోజు వచ్చే స్లాట్లు ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ కేజీ శ్రీనివాస, ఆర్ పిఓజె స్నేహజారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, డిపిఓ శ్రీనివాసరావు వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.