యాదాద్రి భువనగిరి, అక్షిత న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్నేటి వాగులో చిక్కుకున్న వ్యక్తి నీ పోలీసులు, స్థానికులు కాపాడారు. బీబీనగర్ మండలం రావి పహాడ్ తండా-భువనగిరి మండలం అనాజీపురం గ్రామాల మధ్య గల చిన్నేటి వాగులో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు జెసిబి సహాయంతో రక్షించారు. బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి చెందిన వెలువర్తి మహేష్ ఉధృతంగా ప్రవహిస్తున్న చిన్నేటి వాగును దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉధృతి మరింత పెరిగింది. దాంతో పట్టు కోల్పోయిన అతడు లో లెవెల్ బ్రిడ్జి పై నుండి జారిపడి పిల్లర్ని పట్టుకుని సహాయం కోసం అరిచాడు. అది గమనించిన స్థానికులు చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో జెసిబి సహాయంతోఅతని సాహసోపేతంగా ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్. మరియు భువనగిరి రూరల్ ఎస్సై అనిల్ కుమార్ కానిస్టేబుల్ స్టాలిన్ నరేష్ కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. అతని రక్షించి ఆసుపత్రికి తరలించారు పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.