రంగుల పూలద్ది.. బతుకమ్మలు పేర్చి

రంగుల పూలద్ది..
బతుకమ్మలు పేర్చి

మిర్యాలగూడలో ఘనంగా
బతుకమ్మ వేడుకలు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

దసరా ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మహిళలకు మాత్రమే ప్రత్యేక పండుగ బతుకమ్మ. ఆనందోత్సాహల నడుమ మహిళలు ఆడి పాడు కునే ఎంగిలి పూవు బతుకమ్మను ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో అందమైన బతుకమ్మలు పేర్చిన మహిళలు తమ కళాత్మకత చాటుకున్నారు. పసుపుతో చేసిన గౌరమ్మను బతుకమ్మలపై ఉంచి వాటిని ఒక్క చోట చేర్చి గుంపులు గుంపులుగా బతుకమ్మ పాటలతో అలరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కుటుంబ బంధాల ప్రాముఖ్యతను చాటుతూ చప్పట్లతో మహిళలు పాడిన పాటలు ఆకట్టుకోగా బతుకమ్మ ఉత్సవాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, ఇందిరమ్మ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, గాయత్రి అపార్ట్మెంట్, శాంతినగర్, గీతా మందిర్, రెడ్డి కాలనీ 20వ వార్డు మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

కార్యక్రమంలో మందడి రవీందర్రెడ్డి, కోదండ రామాలయం అధ్యక్ష కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, బండారు నరసింహ, పండిత్ రెడ్డి, కిషోర్ రెడ్డి, కరుణాసాగర్ రెడ్డి, రంగారావు, రాజేష్, బెజ్జం నాగరాజు, మారుతి, వెంకటరెడ్డి, మొబైల్ సీను, ఓరుగంటి శివ, పాదూరి సువర్ణ, మాధవి, పాండరమ్మ శ్రీదేవిలు పాల్గొన్నారు. అదేవిధంగా 30 వార్డు బంగారుగడ్డలో మాజీ కౌన్సిలర్ కుర్ర చైతన్య విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి చిరంజీవి, నూనె రవికుమార్. కవిత, రమణ, నాగమణి, స్రవంతి, రేణుక. సరిత, మనీ. లక్ష్మీ లు పాల్గొన్నారు. పట్టణంలోని 42 వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ చీదర్ల సత్యవేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అనంతరం సమీపంలో ఉన్న చెరువులు కుంటల్లో బతుకమ్మలు నిమజ్జనం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking