అడవిదేవులపల్లిలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ
అడవిదేవులపల్లి, అక్షిత ప్రతినిధి:-
తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల సంస్కృతికి సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక గా నిలిచింది.ఆదివారం రోజున మండల వ్యాప్తంగా ఎంగిలి పువ్వుల బతుకమ్మ ప్రారంభమై తొమ్మిది రోజులపాటు సాగే బతుకమ్మ సంబరాలు, ప్రారంభమయ్యాయి,ఈ ఎంగిలి పువ్వుల బతుకమ్మ సందర్భంగా అడవిదేవులపల్లి ఎస్సీ కాలనీ లో మహిళలు,యువతులు పెద్ద ఎత్తున పాల్గొని,సాంప్రదాయ పద్ధతిలో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ,ఘనంగా ఎంగిలి పువ్వుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.