దేవర స్వాతికి కీర్తిచక్ర పురస్కారం

దేవర స్వాతికి కీర్తిచక్ర పురస్కారం

గోల్డ్ మెడల్, స్వర్ణకంకణంతో సత్కారం

సిద్దిపేట, సెప్టెంబర్ 23 ,అక్షిత ప్రతినిధి :

యువ కవి, సాహితీరత్న అవార్డు గ్రహీత దేవర స్వాతి కీర్తిచక్ర పురస్కారం అందుకున్నారు. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దేవర స్వాతి ఉన్నత విద్య అభ్యసిస్తూనే కవిగా రచనలు చేస్తూ తనదైన శైలిలో పురస్కారాలు అందుకుంటుంది. ఆదివారం హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక, గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పురస్కారాల ప్రధానంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్, సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దూడపాక శ్రీధర్, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ ల చేతులమీదుగా దేవర స్వాతి కీర్తిచక్ర జాతీయస్థాయి పురస్కారం, స్వర్ణ కంకణం, గోల్డ్ మెడల్ అందుకున్నారు. అనంతరం స్వాతి రచించిన భారత మాతకు అభివందనం సంకలన పుస్తకం ఆవిష్కరించారు. విద్యార్థి దశలోనే అవార్డులు, పురస్కారాలు అందుకుంటున్న దేవర స్వాతిని సిద్దిపేట ప్రాంత కవులు, కళాకారులు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking