పెండింగ్ కేసులు
క్లియర్ చేయాలి
నల్గొండ జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్
నల్గొండ టౌన్, అక్షిత న్యూస్ :
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు మూడు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు.

ప్రతి అధికారికి సిసి.టి.యన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ రమేష్, డి.సి.ఆర్.బి డీఎస్పీ రవి కుమార్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సి.ఐలు మరియు యస్.ఐలు, తదితరులు పాల్గొన్నారు.