భక్తుల కొంగు బంగారంగా
గడి మైసమ్మ
– 1973లో మేడ్చల్ లో వెలసిన శ్రీ గడి మైసమ్మ అమ్మవారు
– శ్రావణమాసంలో అమ్మవారికి బోనాల జాతర
– శరన్నవరాత్రి ఉత్సవాల్లో భవాని మాల ధరించనున్న భక్తులు
– ఈ నెల 22 నుండి అక్టోబర్ 3 వరకు నవరాత్రి ఉత్సవాలు
మేడ్చల్, అక్షిత ప్రతినిధి :
మేడ్చల్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో వెలసిన శ్రీశ్రీశ్రీ గడి మైసమ్మ అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా పూజలు అందుకుంటుంది. ఈ ఆలయంలో వెలసిన గడి మైసమ్మ అమ్మవారి దర్శనార్ధం భక్తులు మేడ్చల్ నుండే కాకుండా నగరం నుండీ కూడా వస్తారు. పురాతన చరిత్ర కగిలిన ఆలయాల్లో ఈ గడి మైసమ్మ ఆలయం ఒకటని స్థానికులు చెపుతారు. ఈ ఆలయానికి భక్తుల తాకిడి ప్రతి యేటా పెరుగుతూ వస్తుంది.
*1973లో వెలసిన గడి మైసమ్మ అమ్మవారు*
మేడ్చల్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో వెలసిన శ్రీ గడి మైసమ్మ ఆలయం కు ఒక చరిత్ర ఉంది. మేడ్చల్ పట్టణంకు చెందిన పలువురు తెలిపిన వివరాల ప్రకారం 1973 సంవత్సరంలో మేడ్చల్ తహశీల్దార్ ఉన్న డీ.కె.రామారావు కు ఒకరోజు కలలో అమ్మవారు కనిపించిందని స్థానికులు చెప్తున్నారు. అంతకు ముందు గడి మైసమ్మ ఆలయం అప్పట్లో ఉండే గుహలాగ ఉండేదన్నారు. తహశీల్దార్ డి.కె.రామారావు కలలోకి అమ్మవారు వచ్చి నీను ఇక్కడే ఉన్నాను నాకు గుడి కట్టించి ఉత్సవం చేయాలని ఆదేశించిందని చెప్తున్నారు. అమ్మవారు తన కలలోకి వచ్చి చెప్పడంతో కొందరు స్థానికులను కలుపుకుని ఆలయాన్ని నిర్మించుకున్నారు. శ్రీ యవరం శ్రీ చంద్రశేఖర్ సిద్ధాంతి (శ్రీ వర్గల్ శ్రీ సరస్వతి దేవాలయ వ్యవస్థాపకులు) అప్పటి సర్పంచ్ చిలకరాజు, గ్రామ ప్రజల సహకారంతో దేవాలయ పునః నిర్మాణం ఆగమ శాస్త్ర ప్రకారం జరిగింది. ఆలయ నిర్మాణం అనంతరం మొదటి బోనం కూరగాలయ మైసమ్మగా పూజించుకుని భక్తులు బోనం సమర్పించారు. దశరథ మొదటి పోతురాజుగా ఉన్నారన్నారు. ఇంతకింతకు గడి మైసమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ ఆలయంలో జంతు బలి నిషేదం గా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎ కోరిక కోరిన తీరుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
*శ్రావణమాసంలో అమ్మవారికి బోనాల జాతర*
శ్రీ గడి మైసమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. మొదట్లో పలు కుల సంఘాలు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ వస్తుండే వారని స్థానికులు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి ఘనంగా బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ బోనాల జాతరలో పలు యువజన సంఘాలు తొట్టెల ఊరేగింపు, పోతురాలు విన్యాసాలు ఆకట్టుకుంటాయి. మేడ్చల్ పట్టణంలోని ప్రతి కులానికి సంబందించిన వారు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ గడి మైసమ్మ ఆలయంలో జంతు బలి నిషేదం విదించారు. మైసమ్మ ఆలయం అంటేనే మ్యాక పోతులు, గొర్రె పొట్టెళ్ల బలి ఉంటుంది. కానీ మేడ్చల్ లోని శ్రీ గడి మైసమ్మ ఆలయంలో మాత్రం జంతు బలి నిశేదం పూర్తిగా నిషేదించారు. జంతు బలి లేకుండానే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు.

*ఈ నెల 22 నుండి అక్టోబర్ 3 వరకు
నవరాత్రి ఉత్సవాలు*
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. గడి మైసమ్మ ఆలయంలో మొదటగా తాళ్లపల్లి విజయ్ చందర్ గుప్తా దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ఆ నాటి నుండి ఆలయంలో ప్రతి యేడు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. గడి మైసమ్మ ఆలయంలో సుమారు 300 నుండి 500 వరకు భవాని మాల ధరిస్తారు. గడి మైసమ్మ ఆలయంలో 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు భక్తులు అమ్మవారి మాల ధరించి పూజలు చేస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయిన నాటి నుండి చివరి వరకు అమ్మవారిని రోజుకో అలంకారంలో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నెల 22 వ తేది నుండి అక్టోబర్ 3వ తేది వరకు ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు ఈ నెల 22వ తేదిన శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకరణ దర్శం, 2వ రోజు శ్రీ లలితాత్రిపుర సుందరి దేవీ అలంకారం, 3వ రోజు శ్రీ అన్నపూర్ణదేవీ అలంకార దర్శనం, 4వ రోజు శ్రీ గాయత్రి దేవీ అలంకార దర్శనం, 5వ రోజు శ్రీ మహా లక్ష్మీ దేవీ అలంకార దర్శనం, 6వ రోజు శ్రీ భవాని దేవీ అలంకార దర్శనం,7వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవీ అలంకార దర్శనం, 8వ రోజు శ్రీ మహా సరస్వతి దేవీ అలంకార దర్శనం, 9వ రోజు శ్రీ దుర్గా దేవీ అలంకార దర్శనం, 10వ రోజు శ్రీ మహా కాళికా దేవి అలంకార దర్శనం, 11వ రోజు చివరి రోజు శ్రీ గడి మైసమ్మ తల్లి అలంకార దర్శనం తో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.