భూమి కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్న చంద్రం

భూమి కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్న చంద్రం

న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన

చేర్యాల, అక్షిత ప్రతినిధి :

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలోజు చంద్రం తన భూమికోసం ప్రాణాన్ని పోగొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అదే గ్రామానికి చెందిన కత్తుల భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పోలోజు చంద్రం భూమిని 2018లో అప్పు కింద ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తిరిగి అప్పు చెల్లిస్తా నా భూమి నాకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయమని చంద్రం కోరిన భాస్కర్ రెడ్డి నిరాకరించడంతో, గురువారం మనస్థాపానికి గురై చంద్రంకు ఒక్కసారిగా బీపీ పెరగడంతో గుండెపోటుకు గురై చనిపోయాడని ఆరోపిస్తూ చంద్రం శవంతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శవాన్ని భాస్కర్ రెడ్డి ఇంట్లో వేసి భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆందోళన పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఘటన స్థలానికి చేర్యాల సీఐ శ్రీను, ఎస్ఐ నవీన్ మరియు మద్దూరు కొమురవెల్లి మండలాల పోలీసులు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, చివరకు పోలీసుల గ్రామం పెద్దల సమక్షంలో మృతుని కుటుంబానికి భాస్కర్ రెడ్డి ద్వారా న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking