సరికొత్త డిజైన్లు…సరసమైన ధరల్లో

సరికొత్త డిజైన్లు
      సరసమైన ధరల్లో

విశ్వసనీయత
సరికొత్త ఫ్యాషన్లు

వస్త్రాలకే కాదు…
    వేడుకలకు ప్రతిబింబం

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ 15వ
     అతిపెద్ద షోరూమ్‌ ఆరంభం

సినీహీరో నాగచైతన్య, శోభిత ధూళిపాల

వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి :

వస్త్ర ప్రపంచంలో విశ్వసనీయత…సరికొత్త ఫ్యాషన్లకు కేరాఫ్ అడ్రస్ గా
ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ నిలుస్తుందని సినీహీరో నాగ చైతన్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వనస్థలిపురంలో 15వ షోరూమ్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించారు.
కుటుంబ సమేత షాపింగ్‌లో మొదటి వరసలో ఉండే బ్రాండ్‌ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సంస్థగా పేరొందిoదన్నారు. 15వ షోరూమ్‌ను హైదరాబాద్‌లో షాపింగ్‌ ప్రియులు ఎక్కువగా నివసించే వనస్థలిపురం ప్రాంతంలో ఓల్డ్‌ పనామా గోడౌన్స్‌ సమీపంలో ఉన్న బొమ్మిడి ఎలైట్‌ టవర్స్‌లో శుభారంభం అయ్యింది. ప్రముఖ సినిమా జంట అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాలలు అందాన్నీ, ఆకర్షణనూఇనుమడిoపజేస్తూ ఈ వేడుకను ఆరంభించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ పేరు వింటే చాలు సంప్రదాయం, విశ్వసనీయత, సరికొత్త ఫ్యాషన్లు గుర్తుకు వస్తాయని, ఈ సరికొత్త షోరూమ్‌ హైదరాబాద్‌ వనస్థలిపురం వాసులకు అద్భుతమైన షాపింగ్‌ గమ్యంగా నిలుస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు’’ అన్నారు. అదేవిధంగా షోరూమ్‌లోని విశేషాల గురించి ప్రశంసిస్తూ శోభిత ధూళిపాల ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ వారి ఈ సరికొత్త షోరూమ్‌ కేవలం వస్త్రాలకే పరిమితం కాదు. వేడుకలకు ప్రతిబింబమన్నారు.పండుగలు మొదలుకుని వివాహాది శుభకార్యాల కలెక్షన్స్‌ వరకు కుటుంబంలోని అన్ని తరాల వారి అవసరాలకు అచ్చంగా సరిపోయే అనేక వైవిధ్యభరితమైన విశేషాలు ఈ షోరూమ్‌లోఅడుగడుగునా అలరిస్తాయి! ’’అన్నారు. ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సంస్థాపకుడు, ఛైర్మన్‌ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ‘‘సంప్రదాయాలను, ఫ్యాషన్లను ప్రతిబింబించే విధంగా మా 15వ షోరూమ్‌ను వనస్థలిపురంలో నెలకొల్పడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికీ ఇది షాపింగ్‌ గమ్యం అవుతుందని మా గట్టి నమ్మకమన్నారు. ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సంస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ రాజమౌళి మాట్లాడుతూ ‘అతి పెద్దదైన మా సరికొత్త షోరూమ్‌ను వనస్థలిపురంలో నెలకొల్పడం ద్వారా షాపింగ్‌లో వైవిధ్యాన్నీ, విలువలనూ మరో స్థాయికి తీసుకు వెళ్లామని చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నాం.

ఫెస్టివల్‌ కలెక్షన్స్‌ మొదలుకుని వెడ్డింగ్‌వేర్‌ వరకు వనస్థలిపుర వాసులు కోరుకునే ప్రతి అంశం ఇక్కడ అత్యంత ప్రత్యేక స్థాయిలో లభిస్తుంది ’’ అన్నారు. ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సంస్థాపకుడు, హోల్‌ టైం డైరెక్టర్‌ టి. ప్రసాదరావు మాట్లాడుతూ ‘‘మంచి అభిరుచులు కలిగిన షాపింగ్‌ ప్రియులు హైదరాబాద్‌ నగరాన్ని విస్తరింపజేసిన ఈ వనస్థలిపురంలో నెలకొల్పిన మా అతిపెద్ద సరికొత్త షోరూమ్‌కు ఈ ప్రాంతంలోని కుటుంబాల వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నామన్నారు. దసరా, దీపావళి వివాహాది శుభకార్యాల సందర్భంగా మావద్ద చేసే షాపింగ్‌ మీకు పరిపూర్ణమైన ఆనందాన్నీ, శుభాన్నీ అందించగలదని ఆశిస్తున్నాం.

భారతదేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వివిధ ప్రాంతాల పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు, మెన్స్‌, కిడ్స్‌ డిజైనర్‌ వేర్స్‌ మావద్ద సరసమైన ధరలకు లభిస్తాయి’’ అన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌ నిర్వాహక బృందం వనస్థలిపురం, ఓల్డ్‌ పనామా గోడౌన్స్‌ సమీపంలోని బొమ్మిడి టవర్స్‌లో శుభారంభం చేసుకున్న తమ అతిపెద్ద 15వ షోరూమ్‌కు కొనుగోలుదారులకు హృదయపూర్వక స్వాగతం పలికింది. వివిధ పర్వదినాలకు, వివాహాది వేడుకలకు తాము ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రీమియర్‌ కలెక్షన్స్‌ను, లాభదాయక పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబసమేత షాపింగ్‌ అనుభూతిని సొంతం చేసుకోవాల్సిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking