అధికారులంతా
అప్రమత్తంగా ఉండాలి
పరిస్థితి సమీక్షించి
తగు చర్యలు చేపట్టాలి
మత్స్యకారులు చేపల
వేటకు వెళ్ళవద్దు
కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :
జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉంటూ ప్రాణ ఆస్తి,పశు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వి.సి. కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, వి.సి.ద్వారా ఎంపిడిఓలు, తహశీల్దార్ లతో వర్షాలపై కలెక్టర్ సమీక్షించారు.రానున్న 48 గంటలు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని,క్లౌడ్ బరస్ట్ జరిగితే అన్ని శాఖల అధికారులు పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు అనుసరించి లో లెవెల్ కాజ్ వే ల దగ్గర వర్షపు నీరు ప్రవహించి వాహన దారులు, పాదచారులు, పశువులు చిక్కుకుని వర్షపు నీటిలో కొట్టుకుపోయే సంఘటనలు జరుగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్,ఆర్&బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు .పట్టణ, గ్రామ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.ముఖ్యంగా పశువుల కాపరులు నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు, పొంగి ప్రవహించే
కాజ్ వే ల వద్దకు వెళ్ళ కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,మత్స్య కారులు చేపల వేటకు వెళ్ళ వద్దని,గ్రామ పంచాయతీ కార్యదర్శి లు టామ్ టామ్ ద్వారా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. వర్షాల వలన ఎటువంటి సంఘటనలు జరిగినా ఎస్.పి.,ఎస్.డి.ఆర్. ఎఫ్,అధికార యంత్రాగం కు సమాచారం అందించాలని అన్నారు.మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి 24×7 గంటలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మండల స్థాయిలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కూడా 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు,కంట్రోల్ రూమ్ 08542 241165 నెంబర్ కు ఎటువంటి సంఘటనలు జరిగినా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని తెలిపారు.వర్షాలు వలన నిండిన చెరువులు గండి పడి తెగి పోయే ప్రమాదం ఉందని ఇటువంటి చెరువులను,75 నుండి 100 శాతం నిండిన చెరువులను ఇరిగేషన్, తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు పరిశీలించాలని అన్నారు. పాత, శిథిల భవనాలలో ఉన్న వారిని,లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలు పంక్షన్ హాల్ లకు తరలించాలని ఆదేశించారు. మహబూబ్ నగర్, జడ్చర్ల మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తంగా లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. చెరువులు గండి పడే అవకాశం ఉన్న చోట ఇసుక బస్తాలు,తగు పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. కాజ్ వేల వద్ద వర్షపు నీరు పొంగి ప్రవహించితే ప్రజలు ప్రయాణించకుండా బారికే డింగ్ ఏర్పాటు చేసి తగు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్ &బి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వలన విద్యుత్ స్తంభాలు వద్ద కు వెళ్లి వాటిని ముట్టు కోవద్దని,విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని,తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ సంబంధించి ఎటువంటి సంఘటనలు జరిగిన విద్యుత్ శాఖ ఎస్సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 8712472127, 87124721 28 నెంబర్ల కు కాల్ చేసి లేదా వాట్సప్ చేసి సమాచారం అందించాలని అన్నారు. పంచాయతీలలో గ్రామ కార్యదర్శులు, గ్రామ పరిపాలన అధికారులను అప్రమత్తం చేయాలని అన్నారు. వర్షం ఎక్కువగా ఉంటే అంగన్ వాడిలకు లోకల్ హాలిడే ప్రకటించి మూసి వేయాలని అన్నారు. వర్షాల వలన నీటి ట్యాంక్ లు శుభ్రం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ,రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్ డిఓ నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.