ప్రతిష్టాత్మకంగా “మిర్యాల” మిల్లర్స్ ఎన్నికలు

ప్రతిష్టాత్మకంగా
“మిర్యాల” మిల్లర్స్ ఎన్నికలు

అసోసియేషన్ అధ్యక్షులుగా
గౌరు శ్రీనివాస్

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా గౌరు శ్రీనివాస్ వెంకటరమణచౌదరి ఏకగ్రీవం

ఉపాధ్యక్ష, కోశాధికారి పదవులకు ఎన్నికలు..

రామ్ శేఖర్, గందె రాము ఎన్నిక

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అగ్రగామిగా పేరొందిన మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ప్రతి రెండేళ్ల కోమారు ఎన్నికలు జరిపి పాలక మండలిని ఎన్నుకుంటారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం 2025-27 సంవత్సరానికి స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగాయి.

ఎన్నికల అధికారిగా కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పందిరి రవీందర్ వ్యవహరించారు. మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా గౌరు శ్రీనివాస్, ఒకటో కార్యదర్శిగా వెంకటరమణ చౌదరి (బాబి), రెండో కార్యదర్శిగా పోలిశెట్టి ధనుంజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిల్లర్స్ ఎన్నికల్లో మొత్తం 90 ఓటర్లు. ఉపాధ్యక్ష పదవి కోసం మాశెట్టి శ్రీనివాస్, గోళ్ళ రామ శేఖర్ పోటీ పడగా జరిగిన ఎన్నికల్లో మాశెట్టి శ్రీనివాస్ కు 15 ఓట్లు, రామ్ శేఖర్ 69 ఓట్లు రాగా రామ్ శేఖర్ విజయం సాధించారు.

కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో చిల్లంచర్ల శ్రీనివాస్, గందె రాము పోటీపడగా శ్రీనివాస్ కు 42 ఓట్లు, రాముకు 44 ఓట్లు వచ్చాయి. దీంతో రాము కోశాధికారిగా విజయం సాధించినట్లు ప్రకటించారు. 10 మంది డైరెక్టర్ల పదవి కోసం 30 నామినేషన్లు రాగా డ్రా పద్ధతిలో పది మందిని ఎంపిక చేశారు. గౌరు శంకర్, నీలా పాపారావు, పోతుగంటి కృష్ణ, మలిగిరెడ్డి మాధవరెడ్డి, రాయిని శ్రీనివాస్. కొమ్మన పట్టాభిరామ్, గుంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్య ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి పి.రవీందర్ ప్రకటించారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, గుడిపాటి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు చిల్లంచర్ల విజయ్ కుమార్, మంచుకొండ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. కొత్త పాలకవర్గంకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వీట్లు తినిపించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking