పేదలకు మెరుగైన సేవలు
కోరుట్ల, అక్షిత ప్రతినిధి :
నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విశిష్ట కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు, కోరుట్ల అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ చిట్టినేని రఘు అన్నారు. సోమవారం గుండ్లపోచంపల్లి, మేడ్చల్ లో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో “ ఆరోగ్య భారత్ హాస్పిటల్” ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ చిట్టినేని రఘు, అతని శ్రీమతి డాక్టర్ హేమారెడ్డిలు ఇరువురు కలిసి ప్రజలకు ఉపయోగపడే మంచి సేవలు అందించేందుకు చొరవ చూపుతారని ఆశిద్దాం. ఈ కార్యక్రమంలో బద్దం గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ రెడ్డి, జిన్నా శ్రీకాంత్, గాజవేని మహేష్, రాజ్ కుమార్, వాసాల వినయ్ తదితరులు పాల్గొన్నారు.