హక్కుల సాధనకు సమిష్టి పోరు

హక్కుల సాధనకు
       సమిష్టి పోరు

ఐక్యతతోనే
సమస్యల సాధన

జగిత్యాల జిల్లా వ్యవస్థాపక
అధ్యక్షుడు గనవేని మల్లేష్

జగిత్యాల, అక్షిత ప్రతినిధి :

జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన సభ్యత్వాలు పూర్తి చేసి యాదవులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులు సాధించి యాదవుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతానని యాదవ సంఘం వ్యవస్థాపకుడు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. సోమవారం మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామ యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని యాదవ సంఘ భవనoలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మ్యాదరవేని రామాంజనేయులు యాదవ్, ఆసరి మల్లేష్ యాదవ్, దండికే అరవింద్ యాదవ్, మేడిపల్లి మండల నాయకులు కాడవేణి మల్లేష్ యాదవ్, జక్కుల మల్లేష్ యాదవ్ లతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం, న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు. అనంతరం పోరుమల్ల గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం 61 మంది సభ్యత్వం తీసుకోగా వారికి జిల్లా ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించారు. ఈ కార్యక్రమంలో పోరుమల్ల గ్రామ యాదవ సంఘ పెద్దమనుషులు మాధం మల్లయ్య, లక్కం కొమురయ్య, మాధం మల్లారెడ్డి, గుయ్య మల్లయ్య, మాధం కొమురయ్య, నారకట్ల రాజు, నారకట్ల మల్లేష్, ఐలవేణి వెంకటేష్, గుయ్య అంజన్న,లక్కం నరేష్, నారకట్ల పెద్ద బుమన్నా, రాజేందర్, భీమక్క, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking