కపాస్ కిసాన్ యాప్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి
డిండి, అక్షిత ప్రతినిధి :
ప్రతి ఒక్క రైతు తమ పండించిన పత్తిని సిసిఐకి అమ్మాలంటే ముందుగా కపాస్ కిసాన్ అనే మొబైల్ యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని ఏవో రెహానా ఒక ప్రకటనలో తెలిపారు. మొబైల్ యాప్ ను ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకున్నాక మీ యొక్క మొబైల్ నెంబర్ లాగిన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ తేదీ నాడు మిల్లులకు పత్తిని తీసుకువెళ్లాలి ఎవరైనా రైతులు స్లాట్ బుక్ చేసుకోకుండా పత్తిని తీసుకువెళ్తే కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు కావున పత్తి వేసిన ప్రతి రైతు మీ యొక్క మొబైల్ నెంబర్ను యాక్టివేషన్ చేసుకోగలరని తెలిపారు.యాక్టివేషన్ లేని మొబైల్ నెంబర్ వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్లి చేయించుకోగలరని కోరారు.