విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో
సెలూన్ షాపు దగ్ధం
నష్టపరిహారం
చెల్లింపునకు కృషి
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆలేరు/ అక్షిత న్యూస్:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వేణు కాంప్లెక్స్ పైన విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో సెలూన్ షాపు పూర్తిగా దగ్ధమైంది. గుండ్లగూడెం గ్రామానికి చెందిన బొప్పాపురం కిష్టయ్య జీవనోపాధి కోసం వేణు కాంప్లెక్స్ పైన షట్టర్ కిరాయికి తీసుకొని గడ్డం, కటింగ్, చేసుకునేవాడు. బుధవారం రాత్రి సమయంలో షాప్ లో మంటలు వస్తున్న సందర్భంగా గమనించిన పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి మంటలు ఆర్పారు.

అప్పటికే షాపు మొత్తం దగ్ధమైంది. 10 లక్షల రూపాయలు నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ భాదిత కుటుంబాన్ని పరిమర్శించి స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో చరవాణిలో మాట్లాడగా, ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వ నుండి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన కుటుంబం ఆధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.