ఆపదలో అండగా సీఎం సహాయ నిధి
రూ.2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, అక్షిత ప్రతినిధి :
ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మేరీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.ఈ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 లక్షల ఎల్ఓసిని గురువారం క్యాంపు కార్యాలయంలో మేరీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింలు పాల్గొన్నారు