అడ్డగూడురు గురుకుల, కేజిబివి హాస్టల్ ల ఆకస్మిక సందర్శన

అడ్డగూడురు గురుకుల, కేజిబివి హాస్టల్ ల ఆకస్మిక సందర్శన

– నిర్వహించిన లీగల్ సెల్ సభ్యులు

యాదాద్రి భువనగిరి, అక్షిత బ్యూరో :

మండల పరిధిలోని కంచనపల్లి కస్తుర్భా గాంధీ బాలికల పాఠశాల, మంగమ్మగూడెం లో గల బాలికల గురుకుల పాఠశాల వసతి గృహలను గురువారం మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి అదేశాలనుసారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులకి, కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి మధ్యాహ్న భోజన సదుపాయం ను వంటలను పరిశీలించారు.

వసతి గృహం నందు విద్యార్దులు ఉపయోగించే వాష్ రూమ్, టాయిలెట్స్, డార్మెట్ హల్, క్లీనింగ్, అన్ని పరిశీలించి, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహం అడ్మిషన్ వివరాలు, విద్యార్థులకి కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల, పరిసర ప్రాంతాలు, వంట గది, డార్మెట్ రూమ్ లు పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ సభ్యులు బత్తుల గణేష్, కోక సబిత, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking