హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్
* రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం…
* బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి
వలిగొండ/ అక్షిత న్యూస్,:
హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని భాజపా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో వలిగొండ మండల తాహసిల్దార్ కార్యాలయం వద్ద రైతు సమస్యల పైన బిజెపి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి హాజరైనారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చినటువంటి ఎలాంటి హామీలను నెరవేర్చలేదని , రైతు కల్లాలలో, ఐకెపి సెంటర్లో అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యం అయినా పేరుకు ఐకెపి సెంటర్ల వద్ద రిబ్బన్ కటింగ్లు చేయడం జరిగిందని, ఇప్పటివరకు ధాన్యం కాంటాలు ప్రారంభించలేదని వారు ఎద్దేవ చేశారు. అలాగే ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరుగ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని. స్థానిక ఎమ్మెల్యే కనీసం ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలోని అన్ని ఐకేపి సెంటర్లను వెంటనే ప్రారంభించేటట్టు, కలెక్టర్ సంబంధిత అధికారులు చొరవ చూపి రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వం డిమాండ్ చేశారు.అదేవిధంగా పత్తి రైతులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని లేని యెడల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఏంఆర్ఐ కి మెమోరండం అందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సీఎన్ రెడ్డి, జిల్లా నాయకులు బంధారపు లింగస్వామి, రాచకొండ కృష్ణ గారు, కనతాల అశోక్ రెడ్డి, బందారపు రాములు , కందుల తానేష్ గౌడ్, బోడిగే ఆనంద్, మైసొల్ల రామ నర్సు, లోడే లింగస్వామి గౌడ్, మండల ఉపాధ్యక్షులు గంగాధరి దయాకర్, మందుల నాగరాజు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కొత్త రామచంద్రు, యువ మోర్చా మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి,వివిధ గ్రామాల పార్టీ సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.