అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం…
కొండపాక, అక్షిత ప్రతినిధి:
కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్వాడి దేవదానం ఆత్మహత్య తీసుకొని ఆకస్మికంగా మరణించిన కుటుంబానికి గురువారం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు గద్దె రాజు మాట్లాడుతూ అంబేద్కర్ సేవా సమితి స్థాపించి గడచిన రెండు సంవత్సరాలలో ఎంతోమంది పేద కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు.అలాగే భవిష్యత్తులో మా సేవా సమితి ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యుల సహకారంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సేవాసమితి నాయకులు,టీం పాల్గొన్నారు.