చౌడంపల్లిలో పత్తి కొనుగోళ్లపై రివ్యూ సమావేశం నిర్వహించిన
రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి
నార్కట్ పల్లి, అక్షిత న్యూస్ :
పత్తి కొనుగోలు సంబంధించిన రైతులు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే వారి యొక్క మొబైల్ ఫోన్ నెంబర్లను అప్డేట్ చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి గోపి సూచించారు మండలంలోని చౌడంపల్లి లక్ష్మి జిన్నింగ్ మిల్ వద్ద జిల్లా కలెక్టర్ ఆయన పత్తి కొనుగోళ్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి సీసీ కేంద్రంలో మద్దతు పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కారణంగా పూర్తిగా పత్తి ఎండిన తర్వాతనే మార్కెట్ కు రావాలన్నారు.