మార్కెట్లో మొలకెత్తిన ధాన్యం

పిఎసిఎస్ మార్కెట్ లో అధికారుల నిర్లక్ష్యం

మార్కెట్లో మొలకెత్తిన ధాన్యం

ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం

నార్కట్ పల్లి, అక్షిత న్యూస్ :

గత నెల రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి మొలకెత్తున వరి ధాన్యం పిఎసిఎస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు చౌడంపల్లి గ్రామంలో మార్కెట్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఒకే ఒక్క లారీ వరి ధాన్యాన్ని పంపించినట్లు రైతులు చెప్తున్నారు. వర్షం వలన రోజు ఎండిన వడ్లను మళ్లీ కుప్ప పోసుకొని వర్షం పడిన వెంటనే మళ్ళీ తీయాల్సి వస్తుందని కూలీల ఖర్చు కొరతతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు పండించిన పంటను సరైన సమయానికి అమ్ముకోలేకపోతున్నామని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు త్వరగా స్పందించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking