వెజిటేబుల్ మార్కెట్ అభివృద్దే లక్ష్యం..
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్..
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి : శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో నూతనంగా చేపడుతున్న పునర్నిర్మాణ పనులను శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి ఎ సి చైర్మన్ అరికెపూడి గాంధీతో కలిసి పర్యవేక్షించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుందరీకరణతో మార్కెట్ ను ఆదర్శంగా తీర్చితిద్దుతామని వారు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన అత్యవసర పనులను గుర్తించి పనులు చేపడుతున్నట్లు అన్నారు. మార్కెట్ అభివృద్ధితో పాటు చిరు వ్యాపారులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ వీరేశంగౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, కే రాంచందర్, విష్ణువర్ధన్ రెడ్డి, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, రషీద్, అజీమ్, అస్లాం, శ్రీనివాస్, శంకర్, ఆంజనేయులు, అజామ్, సాయి, మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.