వర్షాలతో రైతులకు
అధైర్యం వద్దు
రైతులకు ఇబ్బందులు
తలెత్తొద్దు
తేమ శాతం మిషన్ సీజ్
యాదాద్రి భువనగిరి జిల్లా
కలెక్టర్ హనుమంతరావు
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
మార్కెట్ యార్డులో రైతులు తెచ్చిన ధాన్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌళిక వసతులు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని , వలిగొండ మండలంలోని నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రాని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు ఎవ్వరు కూడా అధైర్యం చెందవద్దని వాతావరణం అనుకూలించే వరకు ధాన్యం చుట్టూ టార్పాలిన్లు, మడిగేలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

షెడ్ల్ మీద నుండి వర్షం నీరు కారడం వలన ధాన్యం కొట్టుకుపోతోందని రైతులు కోరడంతో వెంటనే డోర్ లు నిర్మించాలని మార్కెట్ యార్డు అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ యార్డు మొత్తం తిరిగి పరిశీలించారు. ధాన్యం కుప్పలు ఆరబోయడానికి కాంక్రీట్ సరిగా వేయక గుంతలుగా ఉన్నందున కాంక్రీట్ మధ్యలో గుంతలు పది ఖాళీగా ఉన్న ప్రదేశంలో మొరం పోసి లెవల్ చేయాలన్నారు. మార్కెట్ యార్డులో కరెంటు లో లెవల్ లైన్ ప్రమాదకరంగా ఉంది లారీలు వచ్చి పోయేందుకు ఇబ్బంది కలగకుండా వెంటనే లైన్ మార్చి పెద్దగా ఉన్న కొత్త పోల్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఎస్సీకి ఆదేశాలు జారీ చేశారు. తేమ శాతం చూసే పాత మాయిచ్చేర్ మిషన్ లో తేమ శాతం ఎక్కువగా చూపించడంతో దానిని సీజ్ చేసి ఇంకో మాయిచ్చేర్ మిషన్ తెప్పించి చెక్ చేసి తేమ శాతం చెక్ చేసి ఉపయోగించాలన్నారు. మార్కెట్ లో ఉన్న ధాన్యం వెంటనే తేమ శాతం చెక్ చేసి వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు పడుతున్నందున మిల్లర్లు కూడా రైతులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి 2 గంటల్లో రామన్నపేట మార్కెట్ యార్డు కి లారీ పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.