సరికొత్త విధానంతో మోకాల నొప్పులకు శస్త్ర చికిత్స రోబోటిక్ సర్జరీ ద్వారానే సాధ్యం
ఖమ్మం/అక్షిత బ్యూరో :
సరికొత్త విధానంతో మోకాల నొప్పులకు శాస్త్ర చికిత్స రోబోటిక్ సర్జరీ ద్వారానే సాధ్యమని యశోద వైద్యులు తెలిపారు. నిన్న ఖమ్మం ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యశోద హాస్పిటల్
హైదరాబాద్ సోమాజిగూడ డాక్టర్ సునీల్ దాచేపల్లి మాట్లాడుతూ మోకాలు మార్పిడి అనేది ఇప్పుడు కామన్ అయిందని ఫిజియోథెరపీ చేపిస్తే బాగా నొప్పులు మరియు బెడ్ రెస్ట్ తీసుకోవాలని నెలలు తరబడి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాతకూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయని ప్రజలలో చాలామందికి ఎన్నో అపోహలు ఎన్నో భయాలు ఉన్నాయి.ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మోకాలు మార్పిడి అనేది విజయవంతమైన ఆపరేషన్ అని అన్నారు. మోకాల నొప్పులకు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత చాలామందికి నొప్పి రిలీఫ్ వచ్చి నార్మల్ లైఫ్ లాగానే తమ పనులు తము చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే ప్రతి సంవత్సరం లక్షల్లో మోకాల నొప్పుల ఆపరేషన్లు అవుతున్నాయి.మోకాలు మార్పిడి చేసుకోవడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయని నొప్పులు తగ్గిపోయి రిలీఫ్ గా ఉంటారు.అనవసరంగా నొప్పుల మందులు వాడకుండా కిడ్నీలు కాపాడుకోవచ్చు. బ్రతికినంత కాలం వాళ్ళ కాల మీద వాలే నడవచ్చు. మోకాలు నొప్పి వచ్చాక మెడికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఆపరేషన్ చేయడం కుదరదు. జీవితాంత కాలం మంచం మీదనే ఉండాల్సి వస్తది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏందంటే రోబోటిక్ సర్జరీ. ఇది ప్రస్తుతం చేసే మోకాల మార్పిడి కంటే ఆధునిక పద్ధతి నడిచేటప్పుడు అడుగులు ఒకటి లేదా రెండు డిగ్రీల తేడాలు వేస్తే తొందరగా మోకాళ్ళ చిప్పలు అరిగిపోతాయి. రోబోటిక్ సర్జరీ ద్వారా అయితే ఒకటి లేదా రెండు డిగ్రీల తేడాలలో అడుగులు వేస్తే చిప్పలు అరగవు తేడా రాకుండా ఉంటుంది.కొత్త చిప్పలు ఎక్కువ రోజులు మనకు సుమారు 30 నుండి 35 సంవత్సరాలు వరకు రావచ్చు.రోబోటిక్ సర్జరీకి చేసే గాయం చిన్నగా ఉంటుంది నొప్పి తక్కువ ఉంటుంది లోపల కట్ చేసేది కూడా తక్కువగా ఉంటుంది.తొందరగా నడవడం జరుగుతుంది. రోబోటిక్ సర్జరీ చేసిన నాలుగు గంటల నుండే నడవవచ్చు.రెండు నుండి మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యి వెళ్లిపోవచ్చు. ఫిజియోథెరపీ చేసే సమయంలో నొప్పలు తక్కువగా ఉంటాయి ఆ తర్వాత క్రింద కూర్చోలేము అని పేర్కొన్నారు.కావున సరికొత్త విధానంతో మోకాల నొప్పులకు శాస్త్ర చికిత్స రోబోటిక్ సర్జరీ ద్వారానే సాధ్యం అని అన్నారు.