ఆర్టీసీ ఉద్యోగి తనయుడు ఆర్టీఓగా

ఆర్టీసీ ఉద్యోగి తనయుడు ఆర్టీఓగా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వదిలి గ్రూప్ 1 ఉద్యోగం సాధించి

ఖమ్మం/అక్షిత బ్యూరో :

వజ్రమైనను సాన పట్టనిదే ప్రకాశించదు. కష్టపడితే ఎంతటి అసాధ్యమైనను సుసాధ్యం కాగలదు. అతని కళ్ళ ముందు అత్తెసరు జీతంతో సాదా సీదా జీవితం గడిస్తూనే …తన బిడ్డల భవిష్యత్ కు ఉన్నత చదువులు చదివిస్తున్న తండ్రి కష్టాన్ని స్వయంగా గమనిస్తూ ఉన్నతమైన ఉద్యోగం సాధించాలనే కసితో చదివాడు. కేంద్ర ప్రభుత్వ కొలువు వచ్చినప్పటికి తనివి తీరలే. గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదివి రవాణా శాఖలో ఆర్టీఓగా ధర్మపురి జగదీష్ ఉద్యోగం సాధించి కొలువు తీరాడు.సాధారణ మధ్యతరగతి కుటుంబలో జన్మించిన ధర్మపురి జగదీష్ కష్టపడి చదివి గ్రూప్ వన్ అధికారిగా ఎంపికై ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మారుమూల గ్రామానికి చెందిన ధర్మపురి జగదీష్
అమ్మా గృహిణి గా నాన్న మహబూబాబాద్ జిల్లాలో కండక్టర్ గా నిర్వర్తిస్తున్నారు. అమ్మ నాన్న వెంకటేశ్వర్లు – లక్ష్మి కష్టాన్ని చూస్తూ పెరగడంతో ఎప్పటికైనా ఉన్నత స్థాయికి చేరాలన్న కోరిక చిన్నతనంలోనే బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో అవాంతరాలు ఆటంకాలు ఏర్పడినా వెనక్కి తగ్గలేదు. ఆత్మవిశ్వాసం వీడకుండా చదివి కేంద్ర ప్రభుత్వం
ప్రాథమిక మరియు ఉన్నత విద్య స్థానిక పాఠశాలల్లో అభ్యసించి ఇంటర్ వరంగల్ లో పూర్తిచేసి బిటెక్ (మెకానికల్) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగం బిహెచ్ఇఎల్ లో మేనేజర్ గా ఎంపికై 15 సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ కు కష్టపడి చదివాడు. ఆర్డిఓ కావాలనుకున్న ఆర్టీవో గా ఎంపికైనాడు. తన తండ్రి ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తే కష్టపడి చదివించాడు. ఉన్నత స్థాయికి ఎదగాలని తపనతో గ్రూప్ 1 కి సీరియస్ గా ప్రిపేర్ అయినాడు. గ్రూప్ వన్ సాధించాడు. ఖమ్మం జిల్లా భవన శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా అక్షిత దిన పత్రిక ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ తను గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడంలో తల్లిదండ్రులతో పాటు భార్య శిరీష సహకారం ఎంతో ఉన్నదన్నారు.తెలంగాణలో తొలి గ్రూప్-1 ద్వారా ఆర్డీఓగా ఎంపిక కావడం మొదటి పోస్టింగ్ బాధ్యతలు ఖమ్మంలో పొందటం ఆనందంగా ఉందని తెలిపారు.

పారదర్శకమైన సేవలు అందిస్తాం

-ఆర్టీవో డి జగదీష్

వాహనదారుల రిజిస్ట్రేషన్ లైసెన్స్ ల విషయంలో పారదర్శకమైన సేవలు అందిస్తామని దళారీలను నమ్మాల్సిన అవసరం లేదని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking