జోరుగా అక్రమ
మొరం దందా
అక్రమ మొరం కొనసాగిస్తున్న పట్టించుకోని అధికారులు
అధికారులకు సమాచారం
ఇచ్చిన భయపడేది లేదు
నిజామాబాద్, అక్షిత ప్రతినిధి :
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్ కమ్మర్పల్లి, ఏర్గట్ల, పలు మండలాల్లో వరద కాలువ వెంబడి గల మండలాల, గ్రామాల శివారులో గల వరద కాలువ వద్ద నుండి, చెరువుల నుండి యదేచ్చగా అక్రమ మురంద అక్రమ మొరం దందా కొనసాగుతుంది. మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక మర్మమేమిటో అర్థం కావడం లేదని ఆయా గ్రామాల స్థానికులు వాపోతున్నారు. అక్రమమొరం దందా ను కొనసాగించుకోవడానికి ఒకరిద్దరూ నాయకులు గతంలో అధికార పార్టీలో ఉండడం వల్ల అక్రమాలకు అలవాటు పడ్డవారు, మళ్లీ అధికారంలో ఉన్న పార్టీలో చేరి ఆక్రమ మొరం దందా కొనసాగిస్తున్నారు. మొరం దందా కొనసాగిస్తున్నప్పటికీ ఇదేమిటని జర్నలిస్టులు వెళ్లి ఆరా తీయగా దేవాలయం పేరుతో, ఇందిరమ్మ ఇండ్ల పేరు చెబుతూ, అధికారుల అండదండలతోనే అక్రమంగా కొనసాగుతుందని ఆయా గ్రామాల ఆయా గ్రామాల, మండలాల స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మొరం దందా కొనసాగిస్తున్న అక్రమార్కులు అక్రమార్కులకు కొమ్ముకాస్తూ, అటు అధికారులపై ఒత్తిడి చేయడమో, అధికారులకు ముడుపులు అందించడం తెలియదు గాని, అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల అధికారుల తీరుపై ఆయా గ్రామాల మండల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక నాయకుడు మొరం దందా యదేచ్చగా కొనసాగిస్తామని, ఏ శాఖ అధికారులకు చెప్పుకున్న తాము భయపడదు ఏ శాఖ అధికారులకు చెప్పుకున్న తాము భయపడే ప్రసక్తే లేదని, అధికారులకు సమాచారం అందించిన పట్టుకోరని, ఒకవేళ పట్టుకున్న జరిమానా విధించి మళ్లీ కొనసాగిస్తామని తెలియజేయడం పట్ల, ఆ నాయకునికి అధికారులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఒకపక్క ఇందిరమ్మ ఇండ్లకు మొరం లేక ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయి ఉండగా, ఒకరిద్దరు నాయకులు ఇదే అదనుగా భావించి ఇందిరమ్మ ఇళ్లకు, దేవాలయాలకు, రోడ్లకు మొరం తరలిస్తున్నామని చెబుతూ, అటు ప్రభుత్వ పథకాలు ముందుకు సాగకుండా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఏదేచ్ఛగా మొరం కొనసాగిస్తున్నప్పటికీ, అధికార పార్టీకి చెందిన నాయకులు కావడం వల్ల అధికారులు పట్టించుకోకపోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు, రైతుల పంట పొలాలకు, ఉచితంగానే మొరం అందించాలని బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ప్రజలు సైతం ఆయన నిర్ణయం పట్ల ప్రజలు సైతం ఆయన నిర్ణయం పట్ల హర్ష తీరేకాలు వ్యక్తం చేశారు. అక్రమ మొరం రవాణా వల్ల రవాణా ప్రధాన వంతెనగా ప్రధాన వంతెనగలు, చెక్ డ్యాములు సైతం ప్రమాదానికి గురై అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్రమ అక్రమ మొరం దందా కొనసాగుతున్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు గానీ, పోలీస్ అధికారులు గానీ, మైనింగ్ శాఖ అధికారులు గానీ, ఎస్సారెస్పీ అధికారులు సైతం పట్టించుకోకపోవడం వల్లే, అక్రమార్కులకు కొమ్ము కాయడం వల్లే, మళ్లీ మొరం అక్రమ దందా గత రెండు నెలలుగా జ్వరం మొరం అక్రమ దందా గత రెండు నెలలుగా జోరు అందుకుంది. అక్రమ మొరం దందా వల్ల వరద కాలువ వెంబడి గల రోడ్లు సైతం కొట్టుకుపోయి అటువైపు గల రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అక్రమ మురందనుఅక్రమ మొరం దందాను నియంత్రించాలని మొరం దందాను నియంత్రించాలని ఆయా గ్రామాల, ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు