సాయి కేపీఆర్ కాలనీలో వైన్స్ కు అనుమతులు ఇవ్వొద్దు
ఎక్సైజ్ సూపరిండెంట్ కు కాలనీవాసుల వినతి
చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల పట్టణంలోని శ్రీ సాయి కేపీఆర్ కాలనీలో (ఎంకెఎం) వైన్స్ మరియు పర్మిట్ రూం ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నారని కోరుతూ తమ కాలనీలో వైన్స్ ను నిర్మించొద్దని అభ్యంతరం తెలుపుతూ కాలనీ అసోసియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్, చేర్యాల ఎక్సైజ్ సిఐ లకు పిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కెపిఆర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ఆరేళ్ల వీర మల్లయ్య అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేపీఆర్ కాలనీలో సుమారు వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయని, ఈ కాలనీ పరిధిలో ఎంకేఎం వైన్స్ షాప్ ఏర్పాటు వల్ల వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఎట్టి పరిస్థితుల్లో కెపిఆర్ కాలనీ సమీపంలో వైన్స్ ఏర్పాటుకు అనుమతులు రాకుండా అడ్డుకోవడానికి కాలనీ వాసులు అందరం సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ, ఎక్సేంజ్ సంబంధిత అధికారులు పై విషయాలను దృష్టిలో పెట్టుకొని కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే వైన్స్ పర్మిషన్ ఇవ్వకుండా చూసే బాధ్యత మీదేనని కోరారు.