లింగరాజుపల్లిలో నీటి సమస్యను తీర్చిన ఏజేఆర్ ఫౌండేషన్
వలిగొండ/అక్షిత న్యూస్ :
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజు పల్లి గ్రామంలో నీటి సమస్య ఉండడంతో ఏజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎలిమినేటి జంగారెడ్డిని కలిసి తమ గ్రామంలో నీటి సమస్య ఉన్నదని పరిస్థితి గురించి తెలియజేయగా తమ సొంత నిధులతో వెంటనే స్పందించి గ్రామంలో బోరు వేయించడం జరిగింది. అనంతరం వేసిన బోరు నుండి నీరు రావడంతో గ్రామ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామానికి విచ్చేసిన ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.